29 August, 2026 | 1:22 PM

పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్

29-08-2026 12:34 PM

​కొత్తూరు, అగస్టు 29(విజయక్రాంతి): పెంజర్ల గ్రామ పంచాయతీలో శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (ఎల్.బి) డాక్టర్ కె.కిరణ్మయి పర్యటించి, పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.​గ్రామంలోని పారిశుద్ధ్య నిర్వహణ, పల్లె ప్రకృతి వనం  నర్సరీలను తనిఖీ చేసిన ఆమె, మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం, ఎంపీపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలు మరియు ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి సేవలను సమీక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పిల్లలకు పౌష్టికాహారం, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్యం నిరంతరం కొనసాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.