29 August, 2026 | 1:38 PM

ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు

29-08-2026 12:26 PM

పుల్లూరులో పూజల హరికృష్ణ జన్మదిన వేడుకలు

సిద్దిపేట రూరల్,ఆగస్టు 29: సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ జన్మదిన వేడుకలను సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి హరికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, సిద్దిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని భగవంతుడిని ప్రార్థించారు.

కార్యక్రమంలో రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి, రాములు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఇరెనీ అంజిరెడ్డి, ఏరోళ్ల బాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రీక్కల మహేందర్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కనకయ్య, కోడారి మల్లారెడ్డి, బాచ్చాయిపల్లి సర్పంచ్ ప్రేమలత యాదగిరి, ఉపసర్పంచ్ కాంతుల వెంకటేష్‌, పోచంపల్లి స్వామి, గరిపల్లి వెంకట్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి తో పాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.