29 August, 2026 | 3:43 PM

స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం

29-08-2026 12:31 PM

ఎస్ఐఆర్ నోటీసుల జారీపై ఆర్డివో , బిఎల్ఒ లను అడిగి తెలుసుకున్న పోచారం

బాన్సువాడ, ఆగస్టు 29 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలోని తన నివాసంలో శనివారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసుల జారీ, సంబంధిత ప్రక్రియ మేరకు కొనసాగుతోందనే విషయంపై ఆర్డివోతో పాటు బిఎల్ఒలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అర్హులైన ప్రతి ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్, సర్పంచ్ రమేష్ ఉపసర్పంచ్ లతీఫ్ నాయకులు మోహన్ నాయక్, బలరాం సాయి రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.