మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు
కేసముద్రం, (విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసముద్రం పర్యటనకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సోమవారం కేసముద్రం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కేసముద్రం మున్సిపాలిటీ ఆఫీస్ నిర్మాణానికి భూమి పూజ, కేసముద్రం (వీ )లో నూతనంగా నిర్మించిన 33/11 కె.వి విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభం, నారాయణపురం గ్రామ రైతులకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నట్లు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపన ఏర్పాట్లను చురుకుగా నిర్వహిస్తున్నారు. సభా వేదిక, శిలాఫలకాల ఆవిష్కరణ కోసం చేపట్టిన ఏర్పాట్లను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.






