గవర్నర్‌తో అవాస్తవాలు మాట్లాడించింది
- ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం
- బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి) : గవర్నర్‌తో ప్రభుత్వం ఏదైనా మాట్లాడించేటప్పుడు ఆలోచించాలని.. కానీ ప్రభుత్వం అన్నీ అవాస్తవాలు, గందరగోళమైన మాట లు మాట్లాడించిందని బీజేపీ ఎమ్మెల్యే పా యల్ శంకర్ ఆరోపించారు. ప్రభుత్వం విస్మరించినంత మాత్రాన తాము విడిచిపెట్టమని. తెలంగాణ ప్రజల గొంతుకగా బీజేపీ నిలబడి పనిచేస్తుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసు కొస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ మీడియా పా యింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగంలో ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఎలాంటి ప్రస్తావన లేదని అన్నారు. రైతుల ఇబ్బందులు, ఉద్యోగాల భర్తీ గురించి లేదని, ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావించలేదని తెలిపారు.
విశ్రాంత ఉద్యోగులు గోస పడుతున్నారని ఎన్నేళ్లు అయినా వారికి బెనిఫిట్స్ అందడం లేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన చట్టాలు ఉన్నప్పటికీ వారికి అందాల్సిన సౌకర్యాలు అందడం లే దని ఎమ్మెల్యే విమర్శించారు. బీసీలను పూర్తి గా మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తెలంగాణ గే యం తర్వాత వందేమాతరం గేయాన్ని ఆలపించకుండా ఎంఐఎం ఎమ్మెల్యేలు బయట కు వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగాన్ని, దేశాన్ని అవమానించారని మండిపడ్డారు.




