16 July, 2026 | 1:56 AM

శాకంబరి ఉత్సవాలు

16-07-2026 01:43 AM

మహబూబాబాద్, జూలై 15(విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి ఆలయంలో శాకంబరి నవరాత్ర మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమ య్యాయి. ఉదయం 4:30 గంటలకు నిత్యాహ్నికం పూర్తి చేసిన తర్వాత అమ్మవారికి ఉత్సవానుజ్ఞ ప్రార్ధన జరిపి అనుమతి పొందిన పిమ్మట అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, ఉత్సవ పూర్వాంగ విధి నిర్వహించారు.

ఉదయం 10 గంటలకు వ రంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్స వాలను ప్రారంభించారు.వరంగల్ ఎంపీ కడియం కావ్య శాకాంబరి నవరాత్ర ప్రారం భ వేడుకల్లో పాల్గొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఆలయ ఈవో రామల సునీత ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పక్షం రోజులపా టు నిర్వహించే శాకంబరీ నవరాత్ర వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మ వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.