మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం
జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగం
50 ఏళ్ల స్నేహబంధంపై ఇరుదేశాల హర్షం
విక్టోరియా, జూన్ 28: పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, వీటిపై దీర్ఘకా లికంగా సుస్థిరతను కాపాడేందుకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి గాను సీషెల్స్ అత్యున్నత పురస్కారం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
మూడు రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ వెళ్లిన ప్రధాని మోదీ ఆదివారం రాజధాని విక్టోరియాలోని స్టేట్ హౌ స్‌లో రాష్ట్రపతి హెర్మిని చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారాన్ని అందుకోవడం పట్ల ఆదేశాధ్యక్షుడు పాట్రిక్ హెర్మినికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు ప్రధాని మోదీకి సీషెల్స్ సైనికులు గౌరవ వందనం సమర్పించారు. మోదీ ఇప్పటివరకు పర్యావరణ పరి రక్షణలో భాగంగా మూడు ప్రధాన పర్యావరణ పురస్కారాలను అందుకున్నట్లయ్యింది. 2026 మేలో ఐక్యరాజ్యసమితి సంస్థ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎవో) అగ్రికోలా పతకం, 2018లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ పురస్కారమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు‘ను ప్రదానం చేసింది. అదే సమయంలో అత్యున్నత పురస్కారాలలో సీషెల్ అందించిన పురస్కారం 34వది కావడం విశేషం.
అవకాశాల గని హిందూ మహాసముద్రం: మోదీ..
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు పాట్రిక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అలాగే ప్రతినిధి బృంద స్థాయి చర్చలు కూడా జరిపారు. ప్రధాని మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. సీషెల్స్ అందించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. హిందూ మహాసముద్రాన్ని ఇరుదేశాలకు అవకాశాల గనిగా మార్చేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. మహాసముద్రంలో చిన్నద్వీ పాల సమూహంగా కనిపించే సీషెల్స్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు.
చిన్న ద్వీపాల సమూహం కాదని, పెద్ద సంకల్ప ద్వీపాల సమూహంగా సీషెల్స్‌ను పేర్కొన్నారు. ఇరుదేశాలు పరిశ్ర మలు, వాణిజ్యం, వ్యాపారం, సాంకేతికం, రక్షణ వంటి రంగాల్లో నూతన అవకాశాలను అన్వేషిస్తాయన్నారు. సాంకేతిక రంగంలోని విజయవంతమైన అనుభవాలను సీషెల్స్‌తో కలిసి పంచుకుంటామన్నారు. హిందూ మ హాసముద్ర ప్రాంతంలో సహకారాన్ని మరిం త బలోపేతం చేస్తామన్నారు.
ప్రతినిధి చర్చల్లో పాల్గొన్న భారత బృందం..
ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సీషెల్స్ ద్వైపాక్షిక చర్చల్లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఉన్నారు. సేషెల్స్ ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిళ్ళై నాయకత్వం వహించారు. ఇందులో ప్రధాన మంత్రి, మత్స్య, వ్యవసాయ, నీలి ఆర్థిక వ్యవస్థల మంత్రి వాలెస్ కాస్గ్రో, విదేశాంగ, ప్రవాస వ్యవహారాల మంత్రి బారీ ఫౌర్త్‌తోపాటు ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.
ఇరుదేశాల స్నేహబంధానికి 50 ఏళ్లు: హెర్మిని..
అధ్యక్షుడు హెర్మిని మాట్లాడుతూ.. సీషెల్స్ స్నేహ బంధాలను, పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఇరుదేశాలు భవిష్యత్ దృష్టితో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని ప్రకటించారు. ఇరుదేశాలు దౌత్యబంధాల 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయని సంతో షం వ్యక్తం చేశారు. చరిత్ర, హిందూ మహాసముద్రం, భాగస్వామ్యానికి తమ నిబద్ధతను చాటామన్నారు. బహుళ రంగాల్లో పరస్పర సహకారంతో భారత్ వెంట ఉమ్మడి దార్శనికతను కొనసాగిస్తామని అధ్యక్షుడు హెర్మిని ప్రకటించారు.






