3 August, 2026 | 5:32 PM

Breaking News

అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •   తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం   •   ఇసుక మేటలు తొలగింపు   •   నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి   •   నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం   •   మందలపల్లి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె   •  

మైనర్ విద్యార్థులపై లైంగిక దాడి

03-08-2026 04:27 PM

నిందితులపై పోక్సో కేసు నమోదు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): ఇద్దరు మైనర్ విద్యార్థులపై ముగ్గురు మైనర్ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి భౌరంపేట్ లోని గల తెలంగాణ స్టేట్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లో లైంగిక దాడికి గురైన ఇద్దరు మైనర్ విద్యార్థులు 5వ తరగతి చదువుతున్నారు.

అదే మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్ లో చదివే ముగ్గురు మైనర్ విద్యార్థులు వీరిద్దరిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే బాధితులు ఇద్దరు మైనర్లు కావడంతో ఈ విషయాన్ని స్కూల్ యజమానానికి తెలియజేయలేదు.బాధితులు శనివారం ఇంటికి వెళ్లిన అనంతరం తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో బాధితుల తల్లిదండ్రులు ఆదివారం దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.