3 August, 2026 | 6:34 PM

స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ

03-08-2026 05:21 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల పట్టణంలోని న్యూ అరబిందో డిగ్రీ కళాశాల స్పందన జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో సంయుక్తంగా సోమవారం బోనాలు, గోరింటాకు పండగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి కరస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన తెలంగాణలో బోనాల పండుగ విశిష్టతను తెలియజేయడానికి సహ పాఠ్య కార్యక్రమలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు విద్యార్థులు సంప్రదాయ బద్ధంగా బోనాలను ఎత్తుకొని ఆటపాటలతో నిర్వహించిన సంబరాలు, ఆషాడ మాసం సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న మెహేంది కార్యక్రమం పలువురిని అలరించింది.