ఇసుక మేటలు తొలగింపు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలతో బెల్లంపల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ కి వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన ఇసుక మేటలను జేసీబీ యంత్రం తొలగించారు. రోడ్డుపై పేరుకుపోయిన మట్టితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఇసుక మేటలతో రోడ్డుపై వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి ప్రత్యక్షంగా ఉండి పనులు చేపిస్తున్నారు.
జేసీబీ సహాయంతో తొలగించి రోడ్లను చదును చేయించారు. రోడ్లపై పేరుకుపోయిన ఇసుక మెటల తొలగించి రహదాలను సౌకర్యవంతంగా మార్చారు. దీంతో ఇంతకాలం ప్రయాణికులకు ఎదురైన అవస్థలు తాత్కాలికంగానైనా తొలిగిపోయాయి. రోడ్డు చదువు పనులను మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి తోపాటు మునిసిపల్ కౌన్సిలర్లు చింతల వసంత, బేతి శ్రావణ్ , నాయకులు నీలి కృష్ణ , పీక లక్ష్మణ్ పర్యవేక్షించారు.






