3 August, 2026 | 6:32 PM

అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..

03-08-2026 05:28 PM

రాష్ట్ర స్థాయికి ఏడుగురు ఎంపిక

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సుల్తానాబాద్‌ పట్టణం లోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల (ఐపీఎస్) విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.

అండర్-6 బాలబాలికల విభాగంలో రేష్మిక, ఆరుహీ, మోహన్ రావు, అండర్-8 బాలుర విభాగంలో శివాన్ష్, అండర్-10 బాలుర విభాగంలో శ్రేయన్ గౌడ్, సూర్య నంద, దేవాన్ష్ తమ తమ ఈవెంట్లలో మెడల్స్ సాధించి ఈనెల 7న హనుమకొండ లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థుల ఈ విజయంపై పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపాల్ కృష్ణప్రియ అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ అందించిన పీఈటీలు సత్యం, సతీష్, జ్యోతిలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ సునీత,మేనేజర్ శివ తదితరులు పాల్గొన్నారు.