3 August, 2026 | 5:33 PM

Breaking News

కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ కొసం దరఖాస్తులు ఆహ్వానం   •   అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •   తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం   •   ఇసుక మేటలు తొలగింపు   •   నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి   •   నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం   •  

పెండింగ్ ఉపకార వేతనాలు వెంటనే చెల్లించాలి

03-08-2026 04:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న సుమారు ₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థుల సమస్యలను తెలుసుకొని సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో BJYM జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సూరజ్ నాయక్, సాత్విక్, BJYM నాయకులు కందుల హరీష్, వెంకటేష్, భరత్, విజయ్, సృజన్, బంటి, చరణ్, దీక్షిత్, అనిల్, శ్రీకాంత్, మధు, ప్రణయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.