3 August, 2026 | 6:33 PM

మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి

03-08-2026 05:18 PM

​కలెక్టర్ రాహుల్ శర్మకు ఫిర్యాదు చసేన కుల సంఘాల  జిల్లా చైర్మన్ పీక కిరణ్

మహా ముత్తారం,(విజయక్రాంతి): 27 జులై వినతిపై స్పందించలేదని ఆగ్రహం.. ఆగస్టు 3 ప్రజావాణిలో పునఃఫిర్యాదు ​జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలం కోనంపేట వద్ద గల మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపి) నిర్వహణలో కాంట్రాక్టర్ల అక్రమాలు, తీవ్ర శ్రమదోపిడీ, అదేవిధంగా కోట్ల రూపాయల అలవెన్సుల కుంభకోణంపై పోరాటం తీవ్రరూపం దాల్చింది. సోమవారం జిల్లా కలెక్టరేట్ భవనంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ  జిల్లా చైర్మన్ పీక కిరణ్ నాయకత్వంలో ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ని నేరుగా కలసి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

​గత జులై 27వ తేదీ సోమవారం సైతం ప్రజావాణిలో కోనంపేట ప్లాంట్ లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర వినతిపత్రం అందజేసినప్పటికీ, అధికారులు క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ గానీ, కాంట్రాక్టర్‌పై చర్యలు గానీ తీసుకోకపోవడం విచారకరమని పీక కిరణ్ కలెక్టర్ రాహుల్ శర్మ దృష్టికి తీసుకెళ్లారు. జులై 27 ఫిర్యాదుపై ఎలాంటి స్పందన లేకపోవడంతోనే  (ఆగస్టు 3) మరలా పునఃఫిర్యాదు (రిమైండర్ లేఖ) రూపంలో కలెక్టర్‌కు విన్నవించాల్సి వచ్చిందని తెలిపారు.  

​మంజూరైన పోస్టులు 60-80.. పనిచేస్తున్నది కేవలం 16 మందే!

​ఈ సందర్భంగా పీక కిరణ్ మాట్లాడుతూ.. మహాముత్తారం, అదేవిధంగా పరిసర 6 మండలాలలోని వందలాది గ్రామాలకు నిరంతరం సురక్షితమైన మంచి నీటిని అందించే కోనంపేట మిషన్ భగీరథ ప్లాంట్‌లో నిబంధనల ప్రకారం కనీసం 60 నుండి 80 మంది ఉద్యోగులు/కార్మికులు విధులు నిర్వహించాల్సి ఉందన్నారు. ప్లాంట్  నిరంతర ఆపరేషన్, ఫిల్టర్ బెడ్ బ్యాక్‌వాష్, పంపింగ్, ల్యాబ్ టెస్టింగ్ అదేవిధంగా  గార్డెనింగ్ పనుల కోసం ఈ సిబ్బంది అత్యవసరమని స్పష్టం చేశారు.  

​అయితే కాంట్రాక్టర్/ఏజెన్సీ వర్గాలు ప్రభుత్వ సొమ్మును నొక్కేసే కుట్రతో కేవలం 16 మంది సిబ్బందితోనే నెట్టుకొస్తూ నియామకాలను భర్తీ చేయకుండా తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. పనిచేస్తున్న ఈ 16 మంది కార్మికులపై తీవ్రమైన పనిభారాన్ని మోపుతూ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావలసిన ఆదివారాల సెలవులు, ప్రత్యేక పండుగ సెలవులు ఇవ్వకుండా శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని మండిపడ్డారు.  

​పక్క జిల్లా మహబూబాబాద్ తరహాలోనే అలవెన్సుల కుంభకోణం!

​ఇటీవల పొరుగున ఉన్న మహబూబాబాద్ జిల్లా మిషన్ భగీరథ గ్రిడ్ సెగ్మెంట్ పరిధిలో ఏజెన్సీలు క్రమపద్ధతిలో సాగించిన కోట్ల రూపాయల కుంభకోణాన్ని ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు ఆధారాలతో సహా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  

​జేఏసీ ఆరోపించిన ప్రధాన విషయాలు

​అలవెన్సుల మింగేత కార్మికులకు చెల్లించాల్సిన పిఎఫ్, ఈ ఎస్ ఐ, మెడిక్లెయిమ్ అదేవిధంగా పెట్రోల్ అలవెన్సుల పేరుతో ఒక్కో ఉద్యోగి జీతం నుండి నెలకు రూ. 8,000 నుండి రూ. 12,000 వరకు అక్రమంగా కోతలు విధిస్తున్నారు. ​రికార్డుల ఫోర్జరీ  అక్రమ వసూళ్లు లేని ఉద్యోగులను రికార్డుల్లో ఉన్నట్లు చూపిస్తూ కాంట్రాక్టర్లు బిల్లులు నొక్కేస్తున్నారని, సూపర్‌వైజర్ పోస్టుల నియామకాల పేరిట రూ. 5 లక్షల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ​కనీస హక్కుల కాలరాపత ఉద్యోగులకు కనీసం అపాయింట్‌మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు, నెలవారీ పే-స్లిప్పులు ఇవ్వకుండా భయాందోళనలకు గురిచేస్తున్నారని తెలిపారు.

​జేఏసీ ప్రధాన డిమాండ్లు

​క్రిమినల్ కేసులు నమోదు చేయాలి  నిధుల మళ్లింపు, శ్రమదోపిడీ, కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్న కోనంపేట భగీరథ ప్లాంట్ కాంట్రాక్టర్‌పై తక్షణమే క్రిమినల్ కేసు  నమోదు చేయాలి. ​ఇన్ని సంవత్సరాలుగా అలవెన్సులు, అదేవిదంగా ఓవర్‌టైమ్ (ఓటి) రూపంలో అక్రమంగా కోత విధించిన నిధులను లెక్కగట్టి, ఆ మొత్తాన్ని వెంటనే కార్మికులకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.  

​సెలవులు ఓ టి.వేతనాలు పనిచేస్తున్న కార్మికులకు ఆదివారాల సెలవులు అదేవిదంగా అదనపు పనివేళలకు చట్టబద్ధమైన ఓవర్‌టైమ్ వేతనం అందించాలి. ​ఖాళీల భర్తీ నిబంధనల ప్రకారం మిగిలిన 60 నుండి 80 మంది సిబ్బంది పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలి. ​అర్జీని స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ  స్పందిస్తూ.. సమస్య తీవ్రతను పరిశీలించి మిషన్ భగీరథ అధికారులు అదేవిదంగా కార్మిక శాఖ అధికారుల ద్వారా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.