4 April, 2026 | 10:31 AM

అతిభీకరంగా యుద్ధం

04-04-2026 02:57 AM

35వ రోజూ పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తలు

47 డ్రోన్లు, 18 బాలిస్టిక్, నాలుగు  క్రూయిజ్ క్షిపణులను కూల్చేసిన యూఏఈ

1,000 మంది హిజ్బుల్లా యోధులు హతం: ఐడీఎఫ్

టెహ్రాన్/ బీరుట్/ జెరూసలేం/అబుదాబీ, ఏప్రిల్3: ఇరాన్, -అమెరికా- యెల్ మధ్య యుద్ధ ఘర్షణ తీవ్రమవుతోంది. పశ్చిమాసియాలో 35వ రోజైన శుక్రవారం ఇటు ఇరాన్, అటు గల్ఫ్ ప్రాంతాల్లో భీకర దాడులు కొనసాగాయి. బీరుట్‌లోని హిజ్బుల్లా మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ నగరమంతా మూడు పెద్ద పేలుడు శబ్దాలు ప్రతిధ్వనించాయని రాయిటర్స్ పేర్కొంది. ఇరాన్‌లో గల్ఫ్ ఓడరేవు అయిన చారక్ పై అమెరికా -ఇజ్రాయెల్ దాడిలో ఒకరు మృతి చెందారు.

ఒక ప్యాసింజర్ టెర్మినల్,  పౌర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. మరోవైపు 18 బాలి స్టిక్ క్షిపణులు, 47 డ్రోన్లు, 4 క్రూయిజ్ క్షిపణులను అడ్డుకున్నామని యూఏఈ వెల్లడించింది. ఈ మేరకు యూఏఈ రక్షణ మంత్రి త్వశాఖ ఎక్స్‌లో పేర్కొంది. ఇంకోవైపు టెహ్రాన్‌లోని విశ్వవిద్యాలయ ప్రాంగణం, విమా నాశ్రయంపై దాడి జరిగినట్లు ఇరాన్ ప్రభు త్వ మీడియా వెల్లడించింది. కువైట్‌లో అల్-షువైఖ్ పోర్టులో ఆగిన అమెరికా ఉభయ చర నౌకలపై దాడి చేసినట్లు టెహ్రాన్ తెలిపింది. రెండు వారాల్లో మూడోసారి కువైట్ లోని చమురు శుద్ధి కర్మాగారంపై దాడి జరిగిందని అల్‌జజీరా పేర్కొంది.

ఇరాన్ దాడి లో డీశాలినేషన్ ప్లాంట్ దెబ్బతిన్నదని కువైట్ తెలిపింది. మరోపక్క అమెరికా బ్లాక్ హాక్‌ను కూల్చివేశామని ఇరాన్ మీడియా పేర్కొంది. యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ పేర్కొం ది. గల్ఫ్ ప్రాంతమంతటా అమెరికాకు చెందిన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని, తమ ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4’ 91వ దశలో భాగంగా కొత్త విడత దాడులు నిర్వహించినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. యూఏఈలోని ఒక స్థావరం వెలుపల అమెరికన్ ఫైటర్ పైలట్లు, ఫ్లైట్ ఇంజనీర్ల బృందంపై బాలిస్టిక్ క్షిపణులు దాడి చేశాయని తెలిపింది.

ఇరాక్‌లోని ఇస్లామిక్ రెసిస్టెన్స్‌లో భాగమైన సరా యా అవ్లియా అల్-దామ్, గత 24 గంటల్లో అమెరికా స్థావరాలను లక్ష్యంగా ఐదు దాడులు చేశామని తెలిపింది. టెల్ అవీవ్, ఎయిలాట్లలో ఇజ్రాయెల్ లక్ష్యాలపై మళ్లీ దాడులు జరిపినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఖేష్మ్ ద్వీపం సమీపంలో శత్రు యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ వెల్లడించింది. ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం.. ఖేష్మ్ ద్వీపానికి దక్షిణాన ఒక ‘శత్రుయుద్ధ విమా నాన్ని లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. దాడికి గురైన ఆ జెట్ విమానం హెంగమ్, ఖేష్మ్ ద్వీపాల మధ్య ఉన్న గల్ఫ్‌జలాల్లో కూలిపోయిందని ఆరోపించింది.

యెమెన్ నుంచి తమ భూభాగం వైపు ప్రయోగించిన ఒక క్షిపణిని గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుం చి ఇది నాలుగో ఘటన. ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ ముందస్తు హెచ్చరికలు జారీచేయడంతో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. మరోపక్క తీవ్రఉద్రిక్తల నేపథ్యం లో ఇరాన్, లెబనాన్‌లో ఇప్పటి వరకు సుమారు 1,000 మంది హిజ్బుల్లా కార్యక ర్తలను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ మృతులలో హిజ్బుల్లా చీఫ్ రద్వాన్ దళానికి చెందిన వందలాది మంది ఉన్నారు. గత 24 గంటల్లో, హిజ్బుల్లా ఇజ్రా యెల్‌పైకి 130 రాకెట్లను ప్రయోగించింది. అయితే, కొన్ని నగరాలపై పడడంతో తీవ్రనష్టాన్ని కలిగించాయి.