19 August, 2026 | 11:18 PM

విరాహత్ అలీని పరామర్శించిన పలువురు ప్రముఖులు

19-08-2026 09:25 PM

గజ్వేల్: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అధ్యక్షులు కె. విరాహత్ అలీ మాతృమూర్తి బాషారత్ ఉన్నిసా బేగం అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు గజ్వేల్‌లోని విరాహత్ అలీ నివాసానికి చేరుకుని ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం విరాహత్ అలీతో పాటు కుటుంబ సభ్యులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ జాతీయ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు నందిని సిధారెడ్డి, దేవి ప్రసాద్, వంటేరు ప్రతాప్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నగునూరి శేఖర్, సీనియర్ జర్నలిస్టులు ఫైసల్ అహ్మద్, రంగాచారి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన, మాజీ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్న రాజమౌళి, పలువురు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.