19 August, 2026 | 10:33 PM

స్వాతి జన్మ నక్షత్రం సందర్భంగా యాదాద్రిలో గిరిప్రదక్షిణ

19-08-2026 09:20 PM

పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి స్వాతి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ గిరి ప్రదక్షిణంకు రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గిరిప్రదక్షిణములో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య పాల్గొన్నారు. వేకువజామున ఆలయ ముఖ మండపంలో అర్చకులు శతఘటాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో భవాని శంకర్ తో కలిసి గిరిప్రదక్షిణను ప్రారంభించారు.

స్వాతి జన్మ నక్షత్రం సందర్భంగా నిర్వహించిన ఈ గిరిప్రదక్షిణలో వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్మరణ, గోవింద నామస్మరణలు, భక్తుల ఆధ్యాత్మిక సందడితో యాదగిరిగుట్ట పరిసరాలు మార్మోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. సాంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈవో భవాని శంకర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. స్వామివారి నిత్య రాబడి  22,95,359/- వచ్చినట్లు ఆలయ అధికారి తెలిపారు.