30 May, 2026 | 2:39 AM

పుణెలో కల్తీ మద్యం తాగి 18 మంది మృతి

30-05-2026 01:58 AM

కడుపునొప్పి, కళ్లు తిరిగి మరణం 

పోలీసుల కస్టడీలో నిందితులు

కఠిన చర్యలకు సీఎం ఫడ్నవీస్ ఆదేశం

ముంబై, మే 29: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 48 గంటల్లో 18 మంది బలయ్యారు. విషపూరిత మద్యం తాగి గురువారం 13 మంది మృతి చెందగా, శుక్రవారం మరో ఐదుగురు ప్రాణాలు విడిచారు. పింప్రిచించ్వాడ్ పరిధిలోని ఫుగే వాడి, దాపోడి, హడప్సర్, కాలేపడల్ ప్రాంతాల్లోని వ్యక్తులు మృతిచెందారు.

మద్యం తాగాక బాధితులంతా తీవ్రమైన కడుపునొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో ప్రాణాలు విడిచారు. పోస్టుమార్టం నివేదికలో మద్యంలో ప్రమాదకర మిథనాల్ రసా యనమే కారణమని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో కల్తీఅమ్మకాలు జరు గుతున్నా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇంతమంది ప్రాణాలు పోయేందుకు కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణాలపై భారతీయ న్యాయసంహితలోని సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేశారు.

కల్తీ మద్యం సూత్రధారి యోగేష్‌వాంఖడే పోలీసుల ముందు లొంగిపోగా, మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్ర మ మద్యం ముఠాతో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో నిందితులను విచారిస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్ విచా రం వ్యక్తంచేస్తూ, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యానికి, మరణాలకు కారకులైన ఏ ఒక్కరిని వదిలిపెట్ట బోనన్నారు. ఘటనపై సమగ్రవిచారణ జరి పి దోషులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.