30 May, 2026 | 12:55 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •   డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. గవర్నర్‌తో భేటీ   •   తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఆలస్యంగా విధులకు.. ప్రజల నిరీక్షణ   •   అన్నకు చెల్లెలి నగ్న ఫోటో పంపి డబ్బులు డిమాండ్.. యువకుడు అరెస్ట్   •   అక్రమ సారాయిపై పోలీసుల ఉక్కుపాదం   •   ముష్కిన్ చెరువులో హైడ్రా ఆపరేషన్   •  

డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. గవర్నర్‌తో భేటీ

30-05-2026 11:51 AM

బెంగళూరు: కర్నాటక రాజకీయాల్లో(Karnataka) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా(Siddaramaiah's Resignation) నేపథ్యంలో, రాష్ట్ర నాయకత్వ మార్పుపై రాజకీయ కార్యకలాపాలు తీవ్రమైన వేళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(D.K. Shivakumar) అత్యంత కీలకమైన కాంగ్రెస్ శాసనసభ పక్షం (CLP) సమావేశానికి ముందు, శనివారంనాడు బెంగళూరులోని కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్(Thawar Chand Gehlot) ను అధికార నివాసమైన లోక్ భవన్ లో కలిశారు.

దేశవ్యాప్తంగా తాజా రాజకీయ పరిణామాల కోసం మా Vijayakranthi News హోమ్‌పేజీని సందర్శించండి.

సాయంత్రం 4 గంటలకు CLP సమావేశం

ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై గవర్నర్ తో డీకే శివకుమార్ చర్చించినట్లు సమాచారం. సాయంత్రం సీఎల్పీ భేటీ సమాచారాన్ని డీకే శివకుమార్ గవర్నర్ కు అందించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు విధాన సౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం(Congress Legislature Party Meeting) ప్రారంభం కానుంది. సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని కేపీసీసీ ఆదేశించారు. కేసీ వేణుగోపాల్, రణవీప్ సింగ్ సర్జేవాలా కొత్త నేత ఎన్నికను పర్యవేక్షించనున్నారు.  ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు.

ఇలాంటి బ్రేకింగ్ అప్‌డేట్స్ కోసం Latest News సెక్షన్‌ను ఫాలో అవ్వండి.

జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

జూన్ 3న కర్నాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం(DK Shivakumar Sworn) చేయనున్నారు. 8-10 మంది మంత్రులతో డీకేఎస్ ప్రమాణం చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జునఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు.

దేశ రాజకీయాలకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం National News చదవండి.

ప్రశ్న: కర్ణాటక కొత్త సీఎం ఎవరు?
జవాబు: సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే శివకుమార్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 3న ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది.