21 May, 2026 | 4:49 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకమవుతున్నారు

21-05-2026 01:16 AM

టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న

మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు టీఆర్పీలో చేరిక

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు, యువకులు టీఆర్పీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం ఉ మ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేములవాడ మదన్ మోహన్, రాష్ట్ర కార్యదర్శి యం. శివవీర్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు మున్నూరు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి, నియామక పత్రాలు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శిగా ఆకుల చంద్రశేఖర్, టౌన్ మైనార్టీ అధ్యక్షులుగా నజీర్, దేవరకద్ర ఇన్‌చార్జిగా మంగరాయి వెంకటేష్, దేవరకద్ర మండల ఇన్‌చార్జిగా మన్యం, ప్రధాన కార్యదర్శిగా మల్లేష్‌ను నియమించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అన్ని వర్గాల ప్రజలు ఒకే జెండా కింద ఏకమవుతున్నారని తెలిపారు.

తమ నాయకత్వంలో తెలంగాణలో నిజమైన బీసీ రాజ్యం స్థాపన ఖాయమని ధీమా వ్య క్తం చేశారు. సామాజిక న్యాయం, అన్ని వ ర్గాల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ ఉద్యమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జాతి బిడ్డల సంపూర్ణ మద్దతు ఉందని అన్నారు. బీసీ రాజ్య నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ మల్లన్న నాయకత్వానికి అండగా నిలవాలని నాయకులు పిలుపునిచ్చారు.సమాజంలో మార్పు, బీసీ రాజ్యాధికారం అనే నినాదం తో కొనసాగుతున్న ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కో రారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా యు వజన అధ్యక్షుడు జి. రవికుమార్ సహా పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.