పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.ఎంజేలాఅల్ఫ్రేడ్
సిరిసిల్ల,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపటి ఆదివారం జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) తెలిపారు. జిల్లాలో 0–5 సంవత్సరాల వయస్సు గల 41147మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం జిల్లాలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), 2 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ద్వారా(UPHCs) 41 మొత్తం 358 పోలియో బూత్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఉదయం 7 గంటల నుండి కార్యక్రమం మొదలవుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అలాగే సిరిసిల్ల బస్ స్టాండ్‌లో ప్రత్యేక పోలియో బూత్ ఏర్పాటు చేసి ప్రయాణికుల చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమ పరిసరాల్లోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించేందుకు సహకరించాలని డీఎంహెచ్‌ఓ కోరారు. పోలియో నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, వాలంటీర్లు సమిష్టిగా పనిచేస్తున్నారని తెలిపారు.






