27 June, 2026 | 9:14 PM

ఊరు అభివృద్ధి కోసం అఖిలపక్షం ఏర్పాటు చేయాలి

27-06-2026 08:31 PM

రూ.4 వేల వ్యవహారానికి కాదు..

 ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడాలి: మీసాల రామన్న మాదిగ

వీపనగండ్ల: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలోని పంచాయతీ ట్రాక్టర్ వినియోగానికి సంబంధించిన రూ.4 వేల చెల్లింపు విషయంలో ఏర్పడిన వివాదంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం సమంజసం కాదని తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రామన్న మాదిగ అన్నారు. వీపనగండ్ల అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడాలని ఆయన కోరారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు, సీఐ కార్యాలయం, బీటీ రోడ్లు, ప్రభుత్వ భవనాలు, హాస్టళ్ల సమస్యలు, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల వంటి సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తే అర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, ప్రజాసంఘాలు ఐక్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.