15 June, 2026 | 2:20 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు

22-02-2026 11:59 PM

రామాయంపేట, ఫిబ్రవరి 22: మున్సిపల్ పరిపాలనలో పారదర్శకత, ప్రజలకు తక్షణ సేవలందించడం తమ ప్రధాన లక్ష్యమని రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు స్పష్టం చేశారు. పదవిని అధిరోహించిన అనంతరం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ఆదివారం బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు బాబాగౌడ్ మర్యాద పూర్వకంగా ఆమెను కలిసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, నన్ను నమ్మి గెలిపించిన ప్రతి ఓటరు నాకు ఋణపడి ఉన్న వ్యక్తి. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకో వడమే నా కర్తవ్యమని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత ఇస్తూ తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తన కార్యాలయం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు.