2 July, 2026 | 2:59 PM

Breaking News

గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •  

వరస దొంగతనాల గజదొంగ అరెస్టు

13-02-2026 01:13 AM

ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి

ఆదిలాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి):  జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడిన గజదొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశా రు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించారు.

ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న రాత్రి  దొంగతనాలకు సంబంధించిన 7 కేసులను ఛేదిస్తూ గజదొంగ టేకం రామారావు ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు ఉట్నూర్ మండలం నాగాపూర్ గ్రామంకు చెందినవాడని తెలిపారు.

ఇప్పటి వరకు నిందితుడిపై మొత్తం 36 కేసులు నమోదై ఉండగా, కరీంనగర్,  సిద్దిపేట్ ప్రాం తాల్లో దొంగతనాలు చేసినందుకు గతంలో రెండు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి, జనవరి 6న విడుదలైన అనంతరం మళ్లీ ఉట్నూర్ మండలంలో వరుసగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. నిందితునునీ నుండి 11.4 తులాల బంగారం, 20 తులాల వెండి, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూ ర్ సీఐ ప్రసాద్, ఎస్సై గుంపుల విజయ్, పోలీస్ సిబ్బంది శ్యామ్ రావు,  నరేష్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.