calender_icon.png 13 February, 2026 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర నిధులతోనే రైలుమార్గం నిర్మించండి

13-02-2026 01:17:21 AM

  1. కృష్ణా- వికారాబాద్ రైలుమార్గంపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం వినతి
  2. హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులకు 500 ఎకరాలు కేటాయిస్తాం
  3. మమూనురు ఎయిర్‌పోర్ట్ భూసేకరణ పూర్తి 
  4. వెంటనే నిర్మాణ పనులు చేపట్టండి
  5. పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి 

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) :  కృష్ణా రైలు మార్గా న్ని  కేంద్ర నిధులతో చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొ త్తం తామే భరిస్తామని మరోమారు సీఎం కేంద్ర మంత్రికి గుర్తుచేశారు. రైల్వే శాఖ మం త్రి అశ్వినీ వైష్ణవ్‌తో పార్లమెంట్‌లోని ఆయ న ఛాంబర్‌లో సీఎం రేవంత్ రెడ్డి గురువా రం భేటీ అయ్యారు.

ఈ మార్గంలోని టేకల్‌కోడ్‌లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని, సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని తెలిపారు. 

హైదరాబాద్- చెన్నై (778 కి.మీ.), హైదరాబాద్. -బెంగళూర్ (586 కి.మీ.), హైదరాబాద్- పుణే (556 కి.మీ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని రైల్వే శాఖ మంత్రికి తెలిపారు.  అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైలు మార్గాలని ప్రారంభించాలని సీఎం కోరారు.  హైదరాబాద్ -బెంగళూరు, హైదరాబాద్- పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుందని రైల్వే మంత్రికి  వివరించారు.  

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలి

 తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌కు సమీపంలో నిర్మించనున్న మా మూనూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో సీఎం గురువారం భేటీ అయ్యారు.

మామూనూరు ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్.. ఓవర్ హాల్ రిపేర్ (ఎంఓఆర్) సదుపాయాలు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జౌళి, ఇతర పరిశ్ర మలతో వరంగల్ నగరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని తెలిపా రు.   

వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు కేంద్రంగా ఉంటుందని కేంద్ర మంత్రికి వివరించారు.  ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అనుమతులు వెంటనే మం జూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ ఏర్పాటుకు అదనంగా అవసరమై న 249.82 ఎకరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఆయా సమావేశాల్లో సీఎం వెంట ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్.శ్రీనివాస రాజు, కార్యదర్శి మాణిక్ రాజ్, కేంద్ర పథకా ల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.