21 March, 2026 | 2:04 AM

భారత్ లో ముగిసిన సెన్‌హైజర్, బార్కో టూర్

20-03-2026 10:42 PM

ముంబై, మార్చి 20 ఃసెన్‌హైజర్ బార్కో భారతదేశం వ్యాప్తంగా పలు నగరాలలో చేసిన భాగస్వామ్య పర్యటనను విజయవంతంగా ముగించాయి. గత నెలలో దేశ వ్యాప్తంగా ఢిల్లీ, పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై , బెంగళూరు వంటి ఆరు ప్రధాన నగరాల్లో చేసిన ఈ పర్యటన భాగస్వాములు మరియు కస్టమర్లకు ఇంటిగ్రేటెడ్ హైబ్రిడ్  పరిష్కారాలను అందించాయి. ఈ పర్యటన బార్కో క్లిక్‌షేర్ హబ్ మరియు సెన్‌హైజర్ టీమ్‌కనెక్ట్ బార్ సొల్యూషన్‌ల సామర్థ్యాలను ప్రదర్శించింది. 

ఐటి నిపుణులు, సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, ఎంటర్‌ప్రైజ్ ప్రతినిధులు ఒకే వేదికపై తమ అనుభవాలను పంచుకున్నారు.బార్కో క్లిక్‌షేర్ హబ్ మరియు సెన్‌హైజర్ టీమ్‌కనెక్ట్ బార్ సొల్యూషన్‌హైబ్రిడ్ సమావేశ అనుభవాలను అందించడానికి కలిసి ఎలా పనిచేస్తాయో వెల్లడించింది.  ప్రతి నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధి బృందం నిర్వహించిన ప్రత్యేక సమావేశాలు వారి లక్ష్యాన్ని చాటిచెప్పాయి. “ఈ భాగస్వామ్య  పర్యటన హైబ్రిడ్ సహకారాన్ని సులభతరం చేసే పరిష్కారాలతో పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని సెన్‌హైజర్ ఇండియా బిజినెస్ కమ్యూనికేషన్ సేల్స్ డైరెక్టర్ నవీన్ శ్రీధర అన్నారు.  క్లిక్‌షేర్ హబ్,  సెన్‌హైజర్ టీమ్‌కనెక్ట్ బార్‌లు సులభంగా సమావేశ అనుభవాలను అందించడానికి ఎలా కలిసి పనిచేస్తాయో ప్రదర్శించడానికి సహకార పర్యటన విలువైన వేదికను అందించిందని బార్కోలోని ఏపీఏసీ, సేల్స్ డైరెక్టర్  గోపాల్ కృష్ణ చెప్పారు.