11 July, 2026 | 2:45 PM

రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక

11-07-2026 01:49 PM

సదాశివనగర్, జులై 11(విజయక్రాంతి): ఈ నెల 13 నుండి జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడలు కొల్లూరు  Gaudium ఇంటర్నేషనల్ స్కూల్లో జరగే క్రీడాలకు  ధర్మరావుపేట జిల్లా పరిషత్ విద్యార్థులు  ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారి యూసఫ్ తెలిపారు. అందులో ఎనిమిదో తరగతి విద్యార్థిని గీతం Triathlon Bలో, రిత్విక్ 200 m, రసజ్ఞ 60 m, అఖిల  లాంగ్ జంప్ లో ఈ నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఆర్ శ్రీనివాస్ ప్రతిరోజు క్రీడల్లో శిక్షణ ఇస్తూ వారిని ఎక్కువ పథకాలు సాధించడంలో తోడ్పడుతున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలాగే గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్స్ ఎస్ఎంసి కమిటీ అధ్యక్షురాలు అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.