ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం
బోధన్,జూలై10 (విజయక్రాంతి): బోధన్ డివిజన్ చేనేత సహకార కార్మిక సంఘం ఎన్నికల(Bodhan Division Handloom Cooperative Workers Union Elections) కోలాహలం శుక్రవారంతో ముగిసింది. డైరెక్టర్ పదవుల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్కంఠభరితంగా పోలింగ్ నిర్వహించగా, సభ్యులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడిగా లోల శంకర్, ఉపాధ్యక్షుడిగా మొత్కూర్ నారాయణ ఎన్నికయ్యారు.
డైరెక్టర్లుగా పత్తి గంగారాం, మొత్కూర్ లక్ష్మణ్, శ్యామ్ సుందర్, మొత్కూర్ సాయిలు, తాటిపాముల విజయ్, మొత్కూర్ కళావతి, లక్ష్మి విజయం సాధించారు. విజేతలను పలువురు ప్రజాప్రతినిధులు, చేనేత కార్మికులు, సంఘ సభ్యులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నూతన పాలకవర్గం చేనేత కార్మికుల సంక్షేమం, సంఘ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగియడంతో సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.






