పీడీఎస్ బియ్యం పట్టివేత: డీలర్‌పై కేసు నమోదు
22-08-2026 06:11 PM
నూతనకల్,(విజయక్రాంతి): మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. శనివారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... మిర్యాల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కృష్ణారెడ్డి, లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన 25 క్వింటాళ్ల బియ్యాన్ని తన ఇంటి వద్ద వాహనంలో లోడ్ చేసి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని, వాహనాన్ని సీజ్ చేసి, డీలర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.






