24 August, 2026 | 10:32 PM

Breaking News

పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •  

అక్రమంగా రవాణా అవుతున్న పశువుల పట్టివేత

24-08-2026 09:05 PM

అన్నపురెడ్డిపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి నుంచి అక్రమంగా రవాణా అవుతున్న పశువులను పోలీసులు సోమవారం  స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని అబ్బుగూడెం గ్రామం నుంచి అక్రమంగా పశువుల రవాణా చేస్తుండగా ఏఎస్ఐ పెంటయ్య ఆధ్వర్యంలో వాహన తనకి నిర్వహిస్తుండగా మినీ వ్యాన్ లో పశువులను తరలిస్తుండగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ వాహనదారులను అదుపులో తీసుకొని విచారించగా ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో పశువులను కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా సూర్యపేట పశువుల సంతకు, ఇక్కడి నుంచి హైదరాబాద్ కబేలాలకు తరలిస్తున్నట్టు వెల్లడైంది. పశువులను తరలిస్తున్న టీ జి 04 టి 8769 వాహనాన్ని సీజ్ చేసి ఐదు పశువులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి పశువులను పాల్వంచ గోషాలకు తరలించినట్లు ఏఎస్ఐ తెలిపారు.