రైతులకు అందుబాటులో విత్తన మేళ
ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూరు మండలంలోని ఆర్మూరు, పిప్రి, ఫతేపూర్, గోవింద్‌పేట్ గ్రామాల్లోని రైతు వేదికలలో మంగళవారం రైతుల కోసం విత్తన మేళా నిర్వహించారు. స్థానిక రిటైల్ విత్తన విక్రయదారులు పాల్గొని తమ వద్ద అందుబాటులో ఉన్న ప్రభుత్వ నోటిఫైడ్ విత్తన రకాలను రైతులకు ప్రదర్శించి, వాటి వివరాలను తెలియజేశారు. రైతులకు నాణ్యమైన, ధృవీకరించబడిన విత్తనాల లభ్యతపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన విత్తనాలను కొనుగోలు చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగిందని ఏ.డి.ఏ. విజయ లక్ష్మి పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందుబాటులోకి తీసుకురావడంలో విత్తన మేళా ఉపయోగకరంగా నిలిచిందని అన్నారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ పంటల విత్తనాల గురించి సమాచారం తెలుసుకొని, అవసరమైన విత్తనాలను కొనుగోలు చేయడం జరిగింది.






