29 July, 2026 | 1:35 AM

ప్రశ్నించే గొంతును అణచేసిన కాంగ్రెస్

29-07-2026 12:33 AM
  1. ఎమర్జెన్సీని పుస్తకాల్లో ప్రియాంక చదవలేదా?
  2. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ‘ప్రశ్నించిన ప్రతి గొంతును అణచివేసిన ఆ చీకటి రోజుల (ఎమర్జెన్సీ) గురించి ప్రియాంక గాంధీ పుస్త కాల్లో చదవలేదా? వాళ్ల నానమ్మను అడిగి తెలు సుకోలేదా? లేక ఇవేవీ ఇప్పుడు గుర్తుకురావడం లేదా? అప్పుడు ప్రజాస్వామ్యం కోసం పోరాడిన విద్యార్థులందరూ కాంగ్రెస్ దృష్టిలో తీవ్రవాదులేనా?’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ను ఒక్కసారి తిరగేసుకోవాలని ఆయన హితవు పలికారు.

తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన 369 మంది విద్యార్థులను కాల్చిచంపారని, అప్పుడు ఆ విద్యార్థులంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రవాదుల్లా కనిపించారా? అని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ప్రియాంక వ్యాఖ్య లపై స్పందిస్తూ కిషన్ రెడ్డి ప్రకటనను విడుదల చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, జాప్యం, ద్రోహ రాజకీయాల ఫలితంగా సుమారు 1,200 మంది యువకులు, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు.

ఢిల్లీలో పార్లమెంట్ ముందు యాదిరెడ్డి అనే విద్యార్థి వంటి ఎందరో మంది విద్యార్థులు.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గొంతెత్తిన వేలాది మంది విద్యార్థులను జైళ్లలో బంధించి వేధించింది కూడా కాంగ్రెస్ ప్రభు త్వమే అన్నారు.

కాంగ్రెస్‌కు చరిత్ర గుర్తొచ్చేది అధికారంలో లేనప్పుడు మాత్రమేనని, అధి కారంలో ఉన్నప్పుడు మాత్రం విద్యార్థులపై కాల్పులు, లాఠీచార్జీలు, అరెస్టులు, ఎమర్జెన్సీలు ఇవే కాంగ్రెస్ రాజకీయ వారసత్వమని విమర్శించారు. ‘ప్రియాంక గాంధీ నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని కాంగ్రెస్ రక్త చరిత్ర ప్రజల జ్ఞాపకాల్లో పదిలంగా ఉందని, ఎన్ని అబద్ధాలు చెప్పినా చరిత్ర పుటల్లోనుంచి అవి చెరిగిపోవని కిషన్ రెడ్డి విమర్శించారు.