రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి
కాట్నపల్లి రైతు వేదికలో విత్తన మేళ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని టి ఆర్ వి కె జిల్లా కోఆర్డినేటర్ ఓదెల సంపత్ , సుల్తానాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారి పైడితల్లి అన్నారు. సోమవారం ఎల్ నినో, కంటిన్జెన్సీ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైతు వేదికలో విత్తన మేళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆరుతడి పంటల సాగుకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు, రైతులు దానికి అనుగుణంగా ఆరుతడి పంటలైన కంది, నువ్వులు, మొక్కజొన్న పంటలు సాగు చేయాలని సూచించారు. రైతులు ఈ విత్తన మేళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు..ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, విత్తన, ఫెర్టిలైజర్ డీలర్లు, రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






