విత్తనాలు నాణ్యతతోనే పంట దిగుబడి అధికం
27-07-2026 04:30 PM
నంచర్ల సర్పంచ్ ఎస్ గాయత్రి
మహమ్మదాబాద్ : విత్తనాలు నాణ్యతగా ఉంటేనే పంట దిగుబడి అధికంగా వస్తుందని నంచర్ల గ్రామ సర్పంచ్ ఎస్ గాయత్రి అన్నారు. సోమవారం నంచర్ల రైతు వేదికలో విత్తనా మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విత్తనాలను వినియోగించాలని, వర్షాలు తక్కువగా కురుస్తున్న సందర్భంగా ఆరుతడి పంటలకు ముగుచుపాలని సూచించారు. ఈ విత్తన మేళాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను వ్యవసాయ అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలోమండల వ్యవసాయ అధికారి జె.నరేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఎం నారాయణ, ఉప సర్పంచ్ లక్ష్మయ్య, రైతులు చెన్నరెడ్డి, తిరుమల్ రెడ్డి, అంజిలయ్య ,పాండు తదితర రైతులు పాల్గొన్నారు.






