28 May, 2026 | 11:57 AM

బక్రీద్ సందర్భంగా.. బోధన్ పట్టణంలో భద్రతా ఏర్పాట్ల

28-05-2026 10:38 AM

ప్రధాన రహదారులపై పోలీసుల పహారా

బోధన్: (విజయక్రాంతి): బక్రీద్ సందర్భంగా బోధన్ పట్టణంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తూ పట్టణ సీఐ వెంకట నారాయణ ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాల్లో పహారా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మనోజ్ కుమార్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు పరస్పర సహకారంతో శాంతియుత వాతావరణంలో బక్రీద్ నిర్వహించుకోవాలని సూచించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని బోధన్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణ సీఐ వెంకట నారాయణ మరియు ఎస్సై మనోజ్ కుమార్ ల ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా పహారా నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మత సామరస్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు.