14 May, 2026 | 4:29 AM

చౌటుప్పల్‌లో రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు

14-05-2026 01:28 AM

చౌటుప్పల్, మే 13 :  రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ఈ రోజు చౌటుప్పల్ మండలం లోని రైతువేదికలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమం లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రభావతి మాట్లాడుతూ వచ్చే వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటలలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులను మరియు సస్య రక్షణ చర్యల గురించి ముఖ్యంగా వరిలో సన్న ధాన్యం రకలైనా బిపిటు 5204, ఆర్ ఎన్ ఆర్15048, కేఎన్‌ఎం1638, వై జి ఎల్44(సిద్ది ), హెచ్‌ఎంటి సోనా, జైశ్రీరామ్ వంటి రకాలను సాగు చేసి అధిక దిగుబడితో పాటు ప్రభుత్వం ఇచ్చే క్వింటాలు కు 500 రూపాయల బోనస్ పొందవచ్చాన్నారు.

ఎం టి యు 1010, కేఎన్‌ఎమ్118, వంటి దొడ్డు రకాలను సాగు చేసి గ్రేడ్ ఏ క్రింద మద్దతు ధర పొందవచ్చన్నారు, యూరియా వాడకం తంగ్గించి నానో యూరియా వాడాలన్నారు .  ముఖ్య అతిధి గా పాల్గొన్న  మార్కెట్ కమిటీ చైర్మన్  ఉబ్బు వెంకటయ్య మరియు  ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి   తగిన సలహాలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి,పొల్లేపల్లి లక్ష్మీ,రెడ్డి బావి సర్పంచ్ నందగిరి వెంకట్ గారు,వ్యవసాయ విస్తరణ అధికారులు,రైతులు పాల్గొనడం జరిగింది.