10 May, 2026 | 10:16 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

నైపుణ్యాలు వెలికితీసేవి విజ్ఞాన ప్రదర్శనలు

01-03-2026 12:00 AM

కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

ఘట్ కేసర్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): విద్యార్థులలో దాగి ఉన్న సైన్స్ నైపుణ్యతలను వెలికి తీయడానికి ఇలాంటి ప్రదర్శ నలు ఎంతో ఉపయోగపడుతాయని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెం కటస్వామి అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాపసింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శని వారం జాతీయ సైన్స్ డే సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి పాఠశాలను మాజీ మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డిలతో కలసి సందర్శించి విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్ లను తిలకించి విద్యార్థులు పలు వివరాలను అడిగి తెలుసుకొని అభినందించారు.

పాఠశాలలో మెరు గైన వనతులు, విద్యార్థుల సంఖ్య తదితర అంశాలను ప్రధానోపాధ్యాయుడు రవి కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రదర్శణల పట్ల మంత్రి సం తృప్తి వ్యక్తం చేశారు. అంతకముందు నూతనంగా ఏర్పాటు చేసిన స్పాట్ లైట్ క్రికెట్ గ్రౌండ్ ను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అబేద బేగం, స్థానిక నాయకులు బద్దం కుమార్, చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.