10 May, 2026 | 11:35 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఇంజక్షన్ వికటించి గాంధీలో బాలింత మృతి

01-03-2026 12:00 AM

ఆసుపత్రి వద్ద ఆందోళన

సికింద్రాబాద్, ఫిబ్రవరి28 (విజయక్రాంతి): గాంధీ హాస్పిటల్‌లో బాలింత మృ తి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. బన్సీలాల్పేట మేకల మండికి చెందిన జొన్నల సంజన (26) డెలివరీ కోసం నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో జాయి న్ అయింది. శనివారం ఆమెకు మగ శిశువు జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో నడుం నొప్పి ఉందని సంజన వైద్యులకు చెప్పగా, ఇంజక్షన్ ఇచ్చారని పేర్కొన్నారు.

అయితే ఆ ఇంజక్షన్ వికటించడంతో సంజన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలింత మృతితోకు టుంబ సభ్యు లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎంసిహెచ్ మాతా-శిశు ఆరోగ్య భవనం వద్ద ఆందోళనకు చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యమే సంజన మృతికి కారణమని కుటుంబ సభ్యు లు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.