1 March, 2026 | 9:57 PM

జయ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్

01-03-2026 07:38 PM

చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ జయ పాఠశాలలో ఆదివారం సైన్స్ ఫెయిర్ జయ సృష్టి 2026 పేరుతో ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే బొమ్మల కొలువు, పోతురాజు వేషాలు, నానోట్యూబ్ నమూనా ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్స్ కంట్రోల్డ్ బైరిమోట్, ఫుడ్ కోర్టు, స్పేస్లూమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెడికల్ క్యాంప్ లో తల్లిదండ్రులు పరీక్షలు చేయించుకొని తమ పిల్లల్ని డాక్టర్లుగా చూసి ఎంతో ఆనందించారు.

ఈ ప్రదర్శనకు విచ్చేసిన ముఖ్య అతిది కోదాడ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం మాట్లాడుతూ... విద్యార్థులలో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. కోదాడ మండల విద్యాధికారి షేక్ సలీం షరీప్, అనంతగిరి మండల విద్యాధికారి శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్ నాగేంద్రమ్మ మాట్లాడుతూ జయ పాఠశాల విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

సైన్స్ ఫెయిర్ ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకతను, శాస్త్రీయ నైపుణ్యాన్ని పెంపొందించగలుగుతున్నామని కరస్పాండెంట్ జయవేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి, ప్రధానోపాధ్యాయులు చిలువేరు వేణు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.