వైభవంగా శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు
01-03-2026 07:36 PM
చుంచుపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురు గడ్డ గ్రామంలో ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన లంబాడి సంఘం జేఏసీ వారి అధ్వర్యంలో శ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ మహా భోగ్ బండారో ర్యాలీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ తదితర నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.




