1 September, 2026 | 10:28 PM

బాబోయ్.. గోదాం నుంచి పిడిఎస్ బియ్యం ప్రక్క దారి?

01-09-2026 | 09:20pm

చూస్తూ.. చూడనట్టుగా స్థానిక అధికారుల.. పర్యవేక్షణ

గోదాములో ఉన్న స్టాకు, అసలు స్టాక్ పొంతనలేదు.. అమ్మకాలపై జోరుగా... విమర్శలు

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పేద ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సన్న బియ్యం పంపిణీ చేస్తూ, పేదల ఆకలి తీరుస్తున్న తరుణంలో తుంగతుర్తి గోదాం నుంచి, ఇష్టారాజ్యంగా, గ్రామాల్లో పంపిణీ చేస్తున్న పిడిఎస్ బియ్యం ,పక్కదారి పడుతున్న సంఘటనలు జోరుగా సాగుతున్నాయి. తుంగతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సివిల్ సప్లై గోదాంలో, ప్రతినెల జిల్లా నుండి రావలసిన పిడిఎస్ బియ్యం గోదాములో చేరుకుంటుంది.

ప్రతి నెల మండలంలోని గ్రామాల్లో సంబంధిత కాంట్రాక్టర్ వాహనాలతో పంపిణీ కార్యక్రమాల్లో, అవకతవకలు జరుగుతున్నట్లు జోరుగా విమర్శలు వస్తున్నాయి.  గతంలో కొన్ని సంవత్సరాల నుండి తుంగతుర్తి సర్కిల్లో పట్టుబడ్డ పీడీఎస్ బియ్యం సైతం, వందల క్వింటాల్లో స్టాకు గోదాం లోనే ఉంటున్నది. ఒక ప్రక్క బియ్యం  పురుగులమయంతో ,దుర్వాసన సాగుతుండగా, మరొక పక్క మళ్ళీ వచ్చినటువంటి స్టాక్ కూడా అందులోనే వేయడంతో ఎక్కువగా పురుగులు పడుతూ, మంచి బియ్యం కూడా పాడవుతున్నట్లు పరిశీలిలో తేలుతున్నది.

గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో పట్టుబడ్డ, స్టాక్ ఉన్న బియ్యం మొత్తం నష్టం వాటిల్లుతున్నది. కనీసం ఆ బియ్యానికి ప్రభుత్వ అధికారులు టెండర్ ప్రక్రియ చేపడితే, కొంతైనా ప్రభుత్వానికి ఆర్థిక వనరులు వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రతి సంవత్సరానికి 20 నుంచి 30 బస్తాల బియ్యం తరుగు పేరుతో మాయమవుతున్నది. ఏది ఏమైనా గోదాములో ఉన్న స్టాకు ఒక రకం, చూపెట్టేస్తాకు, మరొకరకంగా లెక్కలు తేలుచున్నవి.

సివిల్ సప్లై గోదాం ఇంచార్జ్ యాదగిరి వివరణ...

 జరిగిన సంఘటనపై గోదావరి ఇంచార్జ్ యాదగిరి దృష్టికి తీసుకపోగా గడిచిన 20 రోజులుగా అనారోగ్యంతో సెలవులో ఉన్నానని, తిరిగి డ్యూటీలో చేరినట్లు, పిడిఎస్ బియ్యం పంపిణీ అవకతవకలపై విచారణ చేపడతామని పేర్కొన్నారు. సోమవారం రోజు తుంగతుర్తి లో గోదాంకు, జిల్లా గోదాం అసిస్టెంట్ డైరెక్టర్ బెనర్జీ విచారణ జరిపి, తన సీక్రెట్ నివేదికను జిల్లా అధికారులకే తెలియపరస్తానని, స్థానిక విలేకరులు పర్పస్ అడగగా, మీకెందుకు నేను చెప్పాలి .. దురుసుగా ప్రవర్తించడం గమనార్వం. గత కొన్ని సంవత్సరాలుగా గోదాంలో బియ్యం మాయమవుతున్న, సంఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, శాఖపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.