12 August, 2026 | 11:56 AM

నల్లగొండలో కలకలం.. కొండమల్లేపల్లిలో స్కూల్ డైరెక్టర్ దారుణ హత్య

12-08-2026 10:39 AM

నల్లగొండ:క్రైం ఆగస్టు 12: కొండమల్లేపల్లి మండలం జేబీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలు రూపా రెడ్డి (45)  కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. భర్త హైదరాబాదులో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆయన రూపా రెడ్డికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చి ఇంట్లో కిరాయికి ఉంటున్న వారికి సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి చూడగా ఇంటి తలుపులు లోపలి నుంచి వేసి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది.గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి.ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి హత్య జరిగిందా? దోపిడీ కోసమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది