12 August, 2026 | 11:00 AM

ఉప్పొంగిన ఒర్రెలు 12 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

12-08-2026 10:18 AM

బెజ్జూర్ ఆగస్టు 12 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని సుస్మిర్ ఒర్రెలు రెండు ఉప్పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వర్షం కురిస్తే చాలు గిరిజన గ్రామాల పరిస్థితి అయోమయంగా మారుతుందని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు సైతం వెళ్ళలేని దుస్థితిగా ఉందని ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన గిరిజన పల్లెల పరిస్థితి మాత్రం మారడం లేదని ప్రజలు తెలుపుతున్నారు. ఇకనైనా అధికారుల స్పందించి గిరిజన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను చూసైనా  పాలకులు,ప్రభుత్వం స్పందించి ఒర్రెలపై వంతెనలు మంజూరు చేసి ప్రజల కష్టాలను తీర్చాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.