28 May, 2026 | 1:35 AM

పోక్సో కేసులో సీన్ రీ కన్‌స్ట్రక్షన్

28-05-2026 12:35 AM

అరణ్య ఫాంహౌస్‌లో బండి భగీరథ్‌ను విచారించిన పోలీసులు

మొయినాబాద్, మే 27 (విజయక్రాంతి): పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారణను ముమ్మరం చేశారు. బుధవారం పేట్ బషీరాబాద్ పోలీసులు తొలుత అతనికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

అనంతరం భారీ భద్రత నడుమ విచారణ నిమిత్తం నేరుగా మొయినాబాద్ మండల పరిధిలోని కాశీంభౌలి శివా రులో గల అరణ్య ఫాంహౌస్‌కు తరలించి, ’సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు. బాధితురాలు, ఆమె తల్లి ఇచ్చిన ప్రాథమిక స్టేట్మెంట్ ఆధారంగా ఘటన రోజున ఏం జరిగింది? నిందితుడు ఎక్కడెక్కడ తిరిగాడు? అనే కో ణంలో ఆధారాలను సేకరించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో క్లూస్ టీమ్, స్థానిక పోలీసులు ఫామ్హౌస్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.