జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు కలెక్టర్ శుభాకాంక్షలు
30-06-2026 12:00 AM
హనుమకొండ, జూన్ 29 (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన టి. వెంకన్న సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ ను హన్మకొండ కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ నూతన కమిషనర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవల అందజేత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై వారు చర్చించారు.






