ఇరుముడి కట్టు..
30-06-2026 01:19 AM
కుటుంబ భావోద్వేగాలే ప్రధానంగా హీరో రవితేజ నుంచి కొత్త సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మి స్తోంది. ఆగస్టు 21న విడుదల కానున్న ఈ మూవీ నుంచి తొలి పాట ‘ఇరుముడి కట్టు’ను సోమవారం విడుదలైంది. ఆధ్యాత్మిక భావోద్వేగాలతో కూడిన భక్తి పాట ఇది.
జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపర్చిన ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ, కళ్యాణ్ చక్రవర్తితో కలిసి సాహిత్యం అందించగా, అనంతు ఆలపించారు. ఈ చిత్రంలో రవితేజ భార్య పాత్రలో ప్రియా భవానీ శంకర్, కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర కనిపించనున్నారు. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేశ్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్; డీవోపీ: విష్ణు శర్మ; ఎడిటర్: ప్రవీణ్ పూడి; ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేశ్.






