30 June, 2026 | 2:05 AM

కోప్పునూరులో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలి

30-06-2026 01:19 AM

కొల్లాపూర్ రూరల్, జూన్ 29: కోప్పునూరు గ్రామంలోని 116 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ వడ్డేమాన్ బిచ్చన్న శుక్రవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ను కోరారు. జీవో నెం.99కు మద్దతుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇండస్ట్రియల్ పార్కు, కోల్ స్టోరేజీల ఏర్పాటుతో రైతులకు, యువతకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.