30 May, 2026 | 6:38 PM

ఎస్సీ హక్కుల పోరాట సంఘం సమావేశం

30-05-2026 06:09 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ఎస్సీ కులాల నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదు, అదే విధంగా అట్రాసిటీ చట్టం వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ SC హక్కుల పోరాట సంఘం  స్వాగతిస్తున్నది. అదేవిధంగా ఆర్టికల్ 341, 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీ కులాల వారికి తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికెట్ ను రద్దుచేసి వారందరినీ బీసీ సీ రిజర్వేషన్ కు చెందిన వారిగా గుర్తించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తున్నది.