30 May, 2026 | 6:38 PM

ఘనంగా సిఐటియు 56వ వార్షికోత్సవం

30-05-2026 06:07 PM

దమ్మపేట,(విజయక్రాంతి): శనివారం సిఐటియు 56వ ఆవిర్భవ దినోత్సవం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక హమాలి అడ్డా వద్ద హమాలి యూనియన్ మండల కార్యదర్శి రామకృష్ణ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కార్మికుల కష్టానికి తగ్గ ఫలితం దక్కాలని, కార్మికులపై జరుగుతున్న వర్గ దోపిడీకి వ్యతిరేకంగా సిఐటియు ఆవిర్భవించిందని  అన్నారు. 

సిఐటియు ఏర్పడిన నాటినుండి దేశ కార్మిక ఉద్యమానికి వారి హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిన ఘనమైన చరిత్ర ఉన్నదన్నారు. ఐక్యత పోరాటంతో ఏర్పడిన ఈ సంఘం గ్రామ స్థాయి నుండి పై స్థాయి వరకు కార్మికులను ఐక్యపరిచి పాలకుల మెడలు వంచి అనేక చట్టాలను తీసుకువచ్చిందని అన్నారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం అంటే భవిష్యత్తు పోరాటాలకు దిశ నిర్దేశం చేసే రోజునేని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, హమాలీ యూనియన్ నాయకులు కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.