విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన సర్పంచ్
30-07-2026 05:59 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గురువారం నిర్వహించిన బాలసభ కార్యక్రమం సందర్భంగా గ్రామ సర్పంచ్ తిట్ల లహరి రాజేష్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సర్పంచ్ సూచించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై కూడా ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వినీత, ఆశా వర్కర్ సంయుక్త తదితరులు పాల్గొన్నారు.






