వారం సంత ప్రారంభించిన సర్పంచ్ మహేశ్వరి సాయిబాబా
చేగుంట,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటులో ఉండేలా చందాయిపేట్ గ్రామంలో అంగడి బజార్ ఏర్పాటు చేసినట్టు గ్రామ సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అంగడి బజార్ ఏర్పాటు గ్రామాభివృద్ధి దిశగా ఇది మరో ముందడుగుగా భావిస్తున్నామని గ్రామ ప్రజలు ఇప్పటివరకు కూరగాయల కోసం సమీప పట్టణాలకు వెళ్లాల్సి వస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామంలోనే శనివారం అంగడి బజార్ నిర్వహిస్తామని, రైతులు నేరుగా తమ పంటలను తీసుకువచ్చి విక్రయించుకునేలా ఏర్పాట్లు చేసామన్నారు. ఈ బజార్ ద్వారా గ్రామ ప్రజలకు, తాజా కూరగాయలు సరసమైన ధరలకు లభించడంతో పాటు, రైతులకు మధ్యవర్తుల సమస్య లేకుండా ప్రత్యక్షంగా విక్రయించే అవకాశం లభించనుందన్నారు. స్థానిక రైతులు తమ పంటలకు తగిన ధర పొందాలన్నారు. అంగడి బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా,, ఉప సర్పంచ్ పబ్బ నాగేష్ గుప్తా, పెద్ద శివనూర్ సర్పంచ్ నర్సిములు,, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్,వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలుపాల్గొన్నారు.




